Modi Trump Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే.. భారత్‌కు చైనాకు ఎప్పటి నుంచో సరిహద్దు సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాను జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తానని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం మోదీ అమెరికాలో పర్యటిస్తూ.. ట్రంప్‌ని కలిసారు.
ఆ సమయంలో వారిద్దరూ సమావేశం అయినప్పుడు ఈ బోర్డర్ సమస్య గురించి వచ్చింది. దాంతో ట్రంప్ తాను సాయం చేస్తానని అందరి ముందు ప్రకటించారు. కానీ ఇందుకు మోదీ ఒప్పుకోలేదు. ట్రంప్ పెద్ద మనసుతో సాయం చేస్తానని అన్నారు కానీ.. భారత్‌కు ఇతర దేశాలతో ఏ సమస్య ఉన్నా మూడో దేశాన్ని మధ్యలోకి తీసుకొచ్చి డీల్ చేసే అలవాటు లేదని.. ఏదున్నా ఇరు దేశాలు కూర్చుని సామరస్యంగా చర్చించుకుంటాయని అన్నారు. అలా మోదీ ట్రంప్ ఆఫర్‌కు నో చెప్పారు.
Modi Trump Meeting ఆల్రెడీ ట్రంప్ భారత్, చైనా, కెనడా వంటి దేశాలపై భారీగా ట్యారిఫ్ చార్జీలు పెంచారు. దాంతో ఆ దేశాలన్నీ అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. చైనా కూడా అమెరికాపై అంతే ట్యారిఫ్‌లు వేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంటో ట్రంప్ చైనాను తీసిపారేయకుండా.. చైనా కూడా తమకు ఎంతో ముఖ్యమైన భాగస్వామ్య దేశమని అన్నారు.