Over Eating బరువు తగ్గాలనుకునేవారికి.. బరువుని అదుపులో పెట్టుకోవాలనుకునేవారికి ఉన్న ఏకైక ప్రధాన సమస్య ఓవర్ ఈటింగ్.
అదేనండీ.. ఆకలి ఉన్నా లేకపోయినా అతిగా ఏదో ఒకటి లాగించేయడం. ఈ అలవాటు మీకూ ఉందా? అయితే.. దీనిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం.
చాలా మంది తెలిసి చేసే పొరపాటు ఏంటంటే.. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ.. వీటిలో ఏవో రెండు వదిలేస్తుంటారు.
OMAD (ONE MEAL A DAY: ఒకపూట తినడం) ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవ్వడంలో తప్పు లేదు కానీ.. క్రేవింగ్స్ కంట్రోల్‌లో లేకపోతేనే ఇబ్బంది.
ఒకపూట తినడం వల్ల అర్థరాత్రి ఆకలితో కడుపు లాగేస్తుంటుంది. ఆకలిని కంట్రోల్ చేసుకోలేని వారు కంటికి ఏది కనిపిస్తే అది లాగించేస్తుంటారు. ఇక్కడే అసలైన సమస్య మొదలయ్యేది.
ఒక పూట తినడం వల్ల తర్వాత ఆకలికి తట్టుకోలేని వారు రెండు పూటల ప్రొటీన్ తప్పనిసరిగా ఉండే ఇంటి భోజనం అలవాటు చేసుకోవాల్సిందే.
ఆకలి అంటే కేవలం కడుపు కాలడమే కాదు.. కొందరికి బోర్ కొట్టినప్పుడు, ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా అది ఆకలిలా అనిపిస్తుంది. దాంతో మళ్లీ ఏదో ఒక చెత్త తినేస్తుంటారు.
ఇలా మీకూ అనిపిస్తుంటే.. రెండు గ్లాసుల నీళ్లు తాగి కాసేపు అటూ ఇటూ తిరగండి. ఆ తర్వాత దాదాపుగా ఆకలి ఫీలింగే ఉండదు. ఒకవేళ అది నిజంగానే ఆకలైతే ఇందాక చెప్పినట్లు ప్రొటీన్ ఉన్న ఫుడ్ తినేందుకు ప్రయత్నించండి.
ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ ఓవర్ ఈటింగ్ అలియాస్ బింజ్ ఈటింగ్ తగ్గకపోతే.. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.





