Guntur గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివనగరాజు అనే వ్యక్తికి 2007లో లక్ష్మీ మాధురి అనే మహిళతో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు సంతానం. అయితే.. శివనగరాజు రెండు రోజులు క్రితం అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు.
పోలీసులు దర్యాప్తు చేపట్టగా… విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న క్రమంలో గోపి అనే వ్యక్తితో లక్ష్మీ మాధురికి పరిచయం ఏర్పడి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
శివనగరాజు చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం నచ్చక, అతన్ని హైదరాబాద్‌లో గోపి నిర్వహిస్తున్న కారు ట్రావెల్స్‌లో ఉద్యోగం చేసేందుకు పంపింది.
కొన్ని రోజుల తర్వాత శివనగరాజు సొంత గ్రామానికి తిరిగి రావడంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతన్ని చంపేందుకు ప్లాన్ వేసింది.
ఈ క్రమంలో రాత్రి బిర్యానీ వండి అందులో 20 నిద్రమాత్రలు కలిపి, భర్త గాఢ నిద్రలోకి వెళ్లాక, ప్రియుడిని ఇంటికి పిలిచి, అతనితో కలిసి శివనగరాజుని చంపేసింది.
గోపి ఛాతిపై కూర్చోగా, భర్త మొహంపై దిండు పెట్టి అతన్ని చంపేసి, గోపి వెళ్లిపోయాక రాత్రంత పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.
ఉదయం 4 గంటలకు స్థానికులను పిలిచి, తన భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు హడావిడి చేసింది.
మృతదేహం చెవిలో నుండి రక్తం రావడం, మొహంపై గాయాలు ఉండడం గమనించి, శివనగరాజు తండ్రితో కలిసి శివ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దీంతో విచారణ జరిపి, ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఊపిరాడకుండా చనిపోయాడని నిర్ధారించుకుని, లక్ష్మీమాధురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.





