Final Asia Cup 2025 నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత్‌తో పాటు అటు దాయాది దేశమైన పాకిస్థాన్‌కు కూడా మర్చిపోలేని.. చరిత్రలో నిలిచిపోయే మూడ సన్నివేశాలను ఇచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా టాస్ ఇంటర్వ్యూను కేవలం ఒక్క బ్రాడ్‌కాస్టర్ మాత్రమే తీసుకుంటాడు. కానీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిన్నటి మ్యాచ్‌లో మాత్రం ఇద్దరు బ్రాడ్‌కాస్టర్లు టాస్ ఇంటర్వ్యూను తీసుకోవడం చరిత్ర సృష్టించింది.
టీమిండియాను రవి శాస్త్రి ఇంటర్వ్యూ చేయగా.. పాక్ టీంను వాకర్ యూనిస్ ఇంటర్వ్యూ చేసాడు. ఇక షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వద్దు అనే ప్రక్రియను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న కూడా కొనసాగించాడు. సాధారణంగా ఫైనల్ మ్యాచ్‌కి ముందు ట్రోఫీ పట్టుకుని ఇరు టీం కెప్టెన్లు ఫోటోలకు పోజులివ్వాల్సి ఉంటుంది. కానీ ఇందుకు టీమిండియా ఒప్పుకోలేదు. ఇది కూడా గతంలో ఎప్పుడూ జరిగింది లేదు. కానీ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాత్రం నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందాన ట్రోఫీ తమకే సొంతం అనే రేంజ్‌లో ట్రోఫీ పట్టుకుని పోజులు ఇచ్చాడు.
ఇక అన్నింటికంటే హైలైట్‌గా నిలిచిన సన్నివేశం ఏంటంటే.. మనోళ్లు మ్యాచ్ గెలిచాక ట్రోఫీని అంగీకరించకపోవడం. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ ట్రోఫీ ఇవ్వాలనుకున్నాడు కానీ మనోళ్లు అతని చేతుల మీదుగా చచ్చినా తీసుకోం అని చెప్పి కేవలం మైదానంలో సెలబ్రేషన్స్ చేసుకుని డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తానే ట్రోఫీ తీసుకుని ఇస్తున్నట్లుగా యాక్ట్ చేసిన సన్నివేశం నిన్నటి మ్యాచ్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది.