Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Mahesh Babu challan fan: బాబ్ కారు చ‌లాన్లు క్లియ‌ర్ చేసిన అభిమాని

Mahesh Babu challan fan: బాబ్ కారు చ‌లాన్లు క్లియ‌ర్ చేసిన అభిమాని

0Shares

Mahesh Babu challan fan: అభిమాన న‌టుల ప‌ట్ల ఫ్యాన్స్‌కి ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మ‌రోసారి నిరూపించిన ఘ‌ట‌న ఇది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కారుకు రెండు పెండింగ్ చ‌లాన్లు ఉంటే.. వెంట‌నే వాటిని క్లియ‌ర్ చేసాడు ఓ అభిమాని. ఆయ‌న చ‌లాన్లు క్లియ‌ర్ చేస్తున్న‌ప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని మ‌రీ ఆ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ బాబు త‌రచూ వాడే రేంజ్ రోవ‌ర్ కారు PVNR ఎక్స్‌ప్రెస్‌ వేపై స్పీడ్ లిమిట్ దాటడంతో రెండు చలాన్లు ప‌డ్డాయి.

ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వ‌స్తుండ‌డంతో ఓ అభిమాని తట్టుకోలేక వెంటనే రూ.2070 చెల్లించి ఆ చ‌లాన్ల‌ను క్లియ‌ర్ చేసాడు. అభిమానం అంటే వాడిది రా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మ‌రికొంద‌రేమో ఆ డ‌బ్బు నువ్వు దాచుకుంటే భ‌విష్య‌త్తులో దేనికైనా ఉప‌యోగ‌ప‌డుతుంది క‌దా.. ఆ డ‌బ్బు మ‌హేష్ బాబు ద‌గ్గ‌ర లేద‌నుకుంటున్నావా అంటూ చీవాట్లు కూడా పెడుతున్నారు.

గ‌తంలోనూ సినీ, రాజ‌కీయ‌, క్రీడా సెల‌బ్రిటీల‌కు చెందిన వాహ‌నాలు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తే చాలు ఆ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ల ఆధారంగా స‌ర‌దాగా ఎన్ని చ‌లాన్లు ఉన్నాయో చెక్ చేసి మ‌రీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ల‌లో ట్రోల్ చేస్తూ మీమ్స్ వేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. కానీ ఓ అభిమాని ఇలా త‌న అభిమాన న‌టుడి ప‌ట్ల జ‌రుగుతున్న ట్రోలింగ్ త‌ట్టుకోలేక చ‌లాన్లు క‌ట్ట‌డం అనేది హైలైట్.

More News

SS Rajamouli
Varanasi: రిలీజ్‌కి ముందే ఆ స్క్రీన్ రావాలి
BySai KrishnaNov 16, 2025

Varanasi: దర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి భార‌త‌దేశంలో 1.43 IMAX స్క్రీన్ రావాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో…

Gautam Gambhir smiling
Gautam Gambhir pitch controversy: అడిగి మ‌రీ త‌న్నించుకున్నారు
BySai KrishnaNov 16, 2025

Gautam Gambhir pitch controversy: ఈరోజు వెస్ట్ బెంగాల్‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్…

Kalvakuntla Kavitha speaking at a political event.
Kalvakuntla Kavitha: కాంగ్రెస్‌కి అవ‌కాశం ఇచ్చిందే BRS
BySai KrishnaNov 16, 2025

Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న విష‌యంలో కామెంట్స్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం BRS పార్టీనే అని..…

Bihar Elections mlas in Bihar are 90% milionaires
Bihar Elections: 90% మంది ఎమ్మెల్యేలు కోటీశ్వ‌రులే
BySai KrishnaNov 15, 2025

Bihar Elections: ఇటీవ‌ల జ‌రిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో NDA కూటమి ఘ‌న విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top