F 35 …. ఇది మన భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలోనే ఓ గేమ్ ఛేంజర్ కాబోతోంది. F-35 Lightning II ఐదో జనరేషన్‌కు చెందిన మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్. అమెరికాకి చెందిన లాక్ హెడ్ మార్టిన్ అనే సంస్థ దీనిని తయారుచేసింది. పవర్‌ఫుల్ సెన్సార్లు, అత్యధిక సామర్ధ్యం కలిగిన టెక్నాలజీతో దీనిని తయారుచేయడంతో ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ ఫైటర్ జెట్‌గా పేరుగాంచింది.
F 35 ఫీచర్స్
శత్రువుల రాడార్ నుంచి సులువుగా తప్పించుకోగదు
శత్రువుల అడ్డాలో ఈ F-35 తిరుగుతున్నా కూడా ఎవ్వరూ కనిపెట్టలేరు
దీని వేగం మ్యాక్ 1.6 (1,200 mph / 1,930 km/h) వరకు ఉంటుంది
దీనికి F135 ఇంజిన్ అమర్చారు. 40,000 పౌండ్ల థ్రస్ట్‌లు ఉత్పత్తి చేయగల అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ఇది.
వాతావరణ పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎగరగలదు, ల్యాండ్ అవ్వగలదు.
360 డిగ్రీల్లో వ్యూ ఉండాలన్న ఉద్దేశంతో 6 ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు అమర్చి డిజైన్ చేసారు.
సాధారణంగా పైలట్లకు తమ ముందు ఉన్న స్క్రీన్లపై డేటా అంతా కనిపిస్తుంది. దీనిని ట్రెడిషనల్ స్క్రీన్స్ అంటారు. కానీ ఈ ఫైటర్ జెట్‌లో మాత్రం HMD ఉంటుంది. అంటే హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే. దీని ద్వారా పైలట్లు ఎలాంటి డేటా చూడాలన్నా తమ హెల్మెట్‌లో అమర్చిన స్క్రీన్స్‌పైనే చూసుకోవచ్చు.
6000 నుంచి 8000 కిలోల బరువున్న ఆయుధాల వరకు మోయగల సామర్థ్యం ఉంది.
గురి తప్పకుండా టార్గెట్ సెట్ చేసిన చోటే మిస్సైల్ దాడి చేయగలదు.
ఈ ఫైటర్ జెట్‌లో వినియోగించాలంటే గంటకు 36వేల డాలర్లు ఖర్చు అవుతుంది.