Earth: మనకు ఒక రోజు అంటే 24 గంటలు అని తెలిసిందే. ముందు ముందు ఒక రోజంటే 24 కాదు 25 గంటలు అవబోతోంది. ఎందుకంటే.. భూమి తిరగాల్సిన వేగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తిరగాల్సిన వేగంలో తిరగడం లేదు. దాంతో రోజులో ఒక గంట పెరగనుంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఆకాశంలో సూర్యుడు యథా స్థానానికి చేరుకోవడానికి 24 గంటలు పడుతోందని గ్రహించి మనకు 24 గంటలు అని చెప్పారు.
ఇప్పుడు భూమి తిరిగే వేగం తగ్గడానికి ప్రధాన కారణం చంద్రుడు. చంద్రుడి కారణంగా సముద్రాల్లో అలల కదలికలో మార్పులు వస్తుంటాయి. దీని వల్ల చంద్రుడు భూమి నుంచి మరింత దూరం వెళ్లనున్నాడు. ఫలితంగా భూమిపై ఉన్న మహా సముద్రాలు, మంచు కారణంగా భూమి తిరిగే వేగంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి మనకు 25 గంటలు ఎప్పుడు వస్తాయి అని అడిగితే మాత్రం.. ఇప్పుడు కానే కాదు. దీనికి ఇంకా 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది.





