Maha shivaratri 2025: ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావడం లేదని బాధపడేవారు ఉంటారు. జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోయినా.. ఆర్థిక సమస్యలు లేకపోయినా కూడా జీవిత భాగస్వామి దొరకని వారూ ఉంటారు. ఇలాంటి సమస్య మీకు ఉన్నట్లయితే.. ఈ నెల 26న రాబోతున్న మహా శివరాత్రి రోజు ఇలా చేసి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
శివ పార్వతులు అంటే ఆది దంపతులు. శివరాత్రి రోజున వారికి కళ్యాణం చేస్తారు. ఆ భగవంతుడి కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అంటాం. కాబట్టి.. ఎవరైతే పెళ్లి కావడం లేదు అని బాధపడుతుంటారో శివరాత్రి రోజున ఏ ఆలయంలో అయితే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్లి ఆ కళ్యాణాన్ని వీక్షిస్తే చాలు. తప్పకుండా పెళ్లి కుదురుతుందట.
కళ్యాణం వీక్షించడంతో పాటు ఈ పని కూడా చేయండి. అదేంటంటే.. కాళిదాసు రాసిన కుమార సంభవం అనే కథలో కూడా ఈ కళ్యాణం గుర్తించి ప్రస్తావించారు. ఈ పార్వతి కళ్యాణం కథ తప్పకుండా చదివి చూడండి. మీరు శివరాత్రి రోజున చదివితే చాలా మంచిది. ఈ కథ చదివిన వారికి తప్పకుండా మంచి సంబంధాలు కుదిరి పెళ్లవుతాయని చెప్తుంటారు. నిజానికి ఏడాదికి ఒకసారైనా ఇంట్లో శివపార్వతుల కళ్యాణ కథ గురించి చదువుకుంటూ ఉండాలట.
దీని వల్ల భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు, మనస్పర్థలు వంటివి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి తన గుండెలో స్థానం ఇస్తే.. శివుడు తన అర్థభాగాన్నే ఇచ్చాడు. ఆ ఆదిదంపతుల కళ్యాణ కథ గురించి చదివిన ఏ జంట అయినా కలకాలం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుంటారు.