Chiranjeevi: చిన్న స్థాయి సినిమాలు, టియర్ 2 హీరోల సినిమాల రిలీజ్‌లన్నింటికీ మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచేస్తున్నారు. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్లి సందడి చేసిన చిరంజీవి.. నిన్న బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ రాజా నటించిన బ్రహ్మానందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా వెళ్లారు. అయితే లైలా సినిమాలో చాలా చక్కగా మాట్లాడిన చిరంజీవి.. నిన్న మాత్రం మాటలు హద్దులు దాటాయి.
ఈ ఈవెంట్‌కు సుమ యాంకరింగ్ చేసారు. వచ్చిన అతిథులను ఆటపట్టించడం, వారిని సరదా ప్రశ్నలు అడగడం సుమకు అలవాటు. నిన్న చిరంజీవిని కూడా సుమ ఓ ప్రశ్న అడిగి ఆటపట్టించారు. మీ తాతగారితో మీకున్న అనుభవాలు చెప్పండి అని సుమ చిరంజీవిని అడిగారు. దీనికి చిరంజీవి సరదాగా సమాధానం ఇస్తారనుకుంటే షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఆయన మహా రసికుడు ! ఇంట్లోనే ఇద్దరు ఉండేవారు, వీరిద్దరి మీద అలిగితే మూడో మహిళ దగ్గరకి వెళ్ళేవాడు….ఇంకా నాలుగో అయిదో వాళ్ళు కూడా ఉండేవారేమో బయట ! నాకు తెలియదు!! అన్నారు. ఈ మాటలు విన్నాక సుమతో పాటు ఆడియన్స్ కూడా కాస్త ఇబ్బందిపడి ఉంటారు. కానీ ఏమీ అనలేక నవ్వుకున్నారు. కానీ అంతటి పెద్ద స్థాయిలో ఉండే చిరంజీవి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
Chiranjeevi కామెడీకి వల్గర్ కామెడీకి సన్న గీత ఉంటుంది. అది ఎవరూ దాటకూడదు. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాదియా తల్లిదండ్రుల శృంగారం అంటూ కామెంట్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతనిపై ఆల్రెడీ పలు కేసులు నమోదయ్యాయి. కేంద్రం కూడా రణ్‌వీర్‌పై మండిపడుతోంది. ఇలాంటి సమయంలో ఎంతో ఆలోచించి మాట్లాడే చిరంజీవి కామెడీ పేరుతో తన తాతగారి గురించి ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అంటారు..!
మళ్లీ ఆడపిల్లనే కంటాడేమో..!
చిరంజీవి వికృత వ్యాఖ్యలు అంతటితో ఆగలేదు. రామ్‌చరణ్‌కి మగపిల్లాడు పుడతాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టిందని.. కనీసం రెండో బిడ్డగా అయినా మగపిల్లాడిని కంటే తమ వంశం వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. చూడబోతే మళ్లీ చరణ్‌కు ఆడపిల్లే పుట్టేలా ఉందని.. తాను ఇంటికి వెళ్లిన ప్రతీసారి ఏదో లేడీస్ హాస్టెల్‌కి వార్డెన్‌లా ఉన్న ఫీలింగ్ వస్తుంటుందని అన్నారు. వంశ వృద్ధి కోసం మగపిల్లాడే కావాలి అంటూ పురిట్లోనే ఆడపిల్లలను చంపేస్తున్న రోజులు ఇప్పుడు తగ్గాయి అనుకుంటే చిరంజీవి లాంటి వ్యక్తులు మళ్లీ పాత రోజుల్ని గుర్తుచేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.