Virat Kohli Anushka Sharma: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మకు BCCI బోర్డు షాకిచ్చింది. గతంలో ఉన్న రూల్‌ని మళ్లీ ఇప్పుడు ప్రవేశపెట్టబోతోంది. దాంతో క్రికెటర్ల భార్యలు తెగ ఫీలైపోతున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు క్రికెటర్ల భార్యలు కూడా వారి వెంట వెళ్తూ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. అందులోనూ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం ఎక్కడికి వెళ్లినా వెంట వెళ్తూనే ఉంటుంది. గతంలో అనుష్క మ్యాచ్ టూర్లకు వెళ్లడంపై వివాదం కూడా నెలకొంది. అనుష్క ఎన్నో సార్లు కాఫీలు టీలు తెప్పించుకుని తాగేదని.. ఆమె వల్ల విరాట్ ఫీల్డ్ పెర్ఫామెన్స్ తగ్గిందని ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. దీనిపై అనుష్క స్పందిస్తూ.. తనకు టీలు, కాఫీలు తాగే అలవాటు లేదని.. ఒకవేళ తాగితే బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతానని అది కూడా తన డబ్బు పెట్టి కొనుక్కుంటానే తప్ప BCCI ఖాతాలో వేసేంత చీప్ క్యారెక్టర్ తనది కాదని చెప్పింది.
ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు బీసీసీఐ క్రికెటర్ల ఫ్యామిలీ విషయంలో కీలక మార్పు చేసింది. ఇక మీదట అంతర్జాతీయ మ్యాచ్‌లకు క్రికెటర్లు తమ ఫ్యామిలీని కేవలం రెండు వారాల వరకు మాత్రమే తీసుకెళ్లాలి. అంతేకానీ ఎన్ని రోజులు మ్యాచ్ జరిగితే అన్ని రోజులు ఉంటానంటే కుదరదు. లగేజీ విషయంలో 150 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న లగేజీకి BCCI ఎలాంటి డబ్బు చెల్లించదు. అదనపు లగేజీ ఉంటే క్రికెటర్లే ఖర్చు పెట్టుకోవాలి. టీంకి చెందిన బస్సుల్లో మాత్రమే క్రికెటర్లు ప్రయాణించాలే తప్ప.. భార్యలతో కలిసి ప్రియురాళ్లతో కలిసి సపరేట్‌గా విమానంలో వస్తానంటే కుదరదు. (Virat Kohli Anushka Sharma)
మొన్నటి వరకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అసిస్టెంట్ గౌరవ్ అరోరా కూడా టీంతో పాటు వెంటే ఉండేవాడు. టీంతో కలిసి వీఐపీ ట్రీట్మెంట్ ఎంజాయ్ చేసేవాడు. ఇక మీదట అది కుదరదు. టీంకి కేటాయించిన హోటల్‌లో వీఐపీ రూమ్స్‌లో అసిస్టెంట్లు ఉండటానికి వీల్లేదు. గంభీర్ మేనేజర్ టీంతో పాటు బస్సులో రావడానికి కూడా అనుమతి లేదు. స్టాఫ్ విషయంలో వారి పదవీ కాలం కేవలం 3 సంవత్సరాలకు మాత్రమే కుదించినట్లు BCCI వెల్లడించింది. BCCI ఇలాంటి కఠిన రూల్స్ గతంలో కూడా విధించింది. ఆ తర్వాత పలు మార్పులు చేసి పోనీలే అని వదిలేసింది. కానీ మొన్న జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన చూసి BCCIకి ఒళ్లుమండింది. క్రికెటర్ల కుటుంబాలు వారితో ఉండటం వల్లే వారు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారని భావించి మళ్లీ పాత రూల్‌ను అమల్లోకి తెచ్చింది.