Bakka Judson: కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి పోటీ చేసినా గెలవడని అన్నారు. రేవంత్‌కు తాను ఛాలెంజ్ చేస్తున్నానని సెక్యూరిటీ లేకుండా కొడంగల్ వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.
జడ్సన్‌ను ఎందుకు సస్పెండ్ చేసారు?
జడ్సన్ మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ డిసిప్లీనరీ కమిటీ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి అతన్ని సస్పెండ్ చేసారు. అక్టోబర్ 27న బక్క జడ్సన్‌కు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై జడ్జన్ మార్చి 30న వివరణ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరణతో డీఏసీ కమిటీ సంతృప్తి చెందలేదు. దాంతో జడ్సన్‌ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసారు.