Asia Cup Trophy: మొన్న జరిగిన ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌కు చేరుకున్న పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. ఆట కంటే ఎక్కువగా పాకిస్థాన్ క్రికెటర్లు మైదానంలో చేసిన అతే ఎక్కువ. దాంతో మన బాయ్స్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ తీసుకునేందుకు నిరాకరించారు. దాంతో నఖ్వీ సిగ్గు లేకుండా ఆ ట్రోఫీ తీసుకుని మైదానం నుంచి వెళ్లిపోయాడు.
ఇప్పటికీ ఆ ట్రోఫీ మన చేతికి రాలేదు. అయితే.. ట్రోఫీ కావాలంటే ఆసియా కప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య కుమార్ యాదవ్ ఏషియల్ క్రికెట్ కౌన్సిల్ కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని నఖ్వీ అన్నట్లు జియో సూపర్ అనే పాకిస్థానీ మీడియా ఛానెల్ వెల్లడించింది. అదే నిజమైతే ఆ ట్రోఫీ లేకపోయినా ఫర్వాలేదు కానీ వారి చేతుల మీదుగా మాత్రం తీసుకునే ప్రసక్తే లేదని మనోళ్లు పట్టుబట్టి కూర్చున్నారు. దరిద్రం ఏంటంటే.. మోహసిన్ నఖ్వీ కేవలం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి ఛైర్మన్ మాత్రమే కాదు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. దాంతో అతను ఏం చెప్తే అది వినేందుకు BCCI సిద్ధంగా ఉందని కలలు కంటున్నాడు.