Arshdeep Singh: రిస్ట్ స్పిన్నర్ యుజ్వేంద్ చాహల్‌కు ఫన్నీగా క్షమాపణలు చెప్పాడు సీమర్ అర్ష్‌దీప్ సింగ్. నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి T20I మ్యాచ్‌లో అర్ష్‌దీప్ అదరగొట్టేసాడు. ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్‌లను సునాయాసంగా ఔట్ చేసేసాడు. 80 T20I మ్యాచ్‌లలో 96 వికెట్లు తీసిన రికార్డు చాహల్‌కు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ బీట్ చేసేసాడు. కేవలం 61 మ్యాచ్‌లలోనే 97 వికెట్లు తీసి స్టార్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు అర్ష్‌దీప్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
అతను ఎక్కడికెళ్లినా చాహల్ రికార్డు బీట్ చేసేసావుగా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆట అనంతరం ప్రెస్ మీట్‌లో అర్ష్‌దీప్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాహల్ రికార్డును బీట్ చేసిన మీకు ఎలా అనిపిస్తోంది అని అడిగారు. దీనికి అర్ష్‌దీప్ స్పందిస్తూ.. చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లకు నా కష్టానికి ఫలితం దక్కింది అనిపిస్తోంది. చాహల్ భాయ్ సారీ.. నీ రికార్డు బద్దలుకొట్టినందుకు అంటూ చెవులు పట్టుకుని అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పడం వైరల్‌గా మారింది. నిన్న జరిగిన తొలి T20I మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తీసిన కీలక వికెట్ల వల్లే భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. అందులోనూ ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పెర్ఫామెన్స్‌పై అభిమానులు, BCCI గుర్రుగా ఉన్నారు. ఆ ఓటమి తర్వాత టీమిండియాకు నిన్నటి గెలుపు కాస్త ఊపిరిపోసింది. ఇదే మాదిరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గెలవాలని BCCI తెలిపింది. (Arshdeep Singh)
T20I సిరీస్ షెడ్యూల్ ఇదే
రెండో మ్యాచ్ – జనవరి 25, 2025, చెన్నైలోని చిదంబరం స్టేడియం
మూడో మ్యాచ్- జనవరి 28, 2025, నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
నాలుగో మ్యాచ్: జనవరి 31, 2025, MCA స్టేడియం, పుణె
ఐదో మ్యాచ్ – ఫిబ్రవరి 2, 2025, వాంఖెడ్ స్టేడియం, ముంబై