Drinking మద్యం తాగాలంటే షాపులకో బార్లకో వెళ్లాలి. అంతేకానీ మన శరీరమే మద్యాన్ని తయారుచేయడమేంటి? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే.. శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ ఇంట్రెస్టింగ్ అంశాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. మద్యం తాగాక మనిషి అసలు తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా గుర్తించలేడు. తన లోకంలో తనుంటాడు. కానీ అసలు మద్యం అలవాటు లేనివాడు కూడా తాగినట్లు మైకంలో ఉంటే?
ఇలాంటి కేసులను ABS అంటారు. అంటే ఆటోమేటిక్ బ్రూవెరీ సిండ్రోమ్. మనం మద్యం తాగకపోయినా మన కడుపులో మద్యం దానంతట అదే ఏర్పడుతుంది. అదెలాగంటే… కొన్ని గట్ బ్యాక్టీరియాలు కార్బోహైడ్రేట్స్ నుంచి ఇథనాల్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇథనాల్ కూడా ఒకరమైన ఆల్కహాలే. ఈ ఇథనాల్ రక్తనాళాల్లోకి వెళ్లి మనిషిని మైకంలో ముంచుతుంది. అందుకే తాగకపోయినా తాగినట్లు మత్తుగా అనిపిస్తుంటుంది. కానీ పాపం ఇలాంటి సమస్య ఉన్నవారు తాము తాగలేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు.
అయితే.. ఇలాంటి కేసులను వైద్యులను కూడా గుర్తించలేకపోతున్నారు. ఒక మనిషికి నీరసం, మాట తడబడటం, మైకంలో ఉన్నట్లు ఉండటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా చేయాల్సింది బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్. అప్పుడు పేషెంట్స్‌కి ABS సమస్య ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ సమస్య ఉందని తెలిస్తే మాత్రం వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఇలాంటి వారు పాపం తాగకుండా డ్రైవింగ్ చేస్తున్నా తాగినట్లే ఉంటుంది కాబట్టి పోలీసులు పట్టుకుంటారు. అయితే.. దీనికి చికిత్స లేదా అంటే ఉంది. దానిని FMT అంటారు. అంటే ఫీకల్ మైక్రో బయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇది గట్ బ్యాట్లీరియా ఇమ్‌బ్యాలెన్స్‌ను తగ్గిస్తుంది. అయితే.. ABS అనేది చాలా అరుదైన సమస్య కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.





