Anasuya Bharadwaj: కొన్ని రోజులుగా యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ దుస్తుల తీరుపై ఆమె పోస్ట్ చేసే వల్గర్ పోస్ట్‌లపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. నటుడు శివాజీ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవిస్తారని.. లేదంటే వారిని దరిద్ర ము**** అంటారని వ్యాఖ్యలు చేయడంతో అనసూయ రిప్లై ఇచ్చారు. నా శరీరం నా ఇష్టం అన్న క్యాప్షన్‌ను పోస్ట్ చేసారు.
కానీ మద్దతు శివాజీకే ఎక్కువగా ఉండటంతో అనసూయ ట్రోల్ అయ్యారు. కాంగ్రెస్ నేత సంధ్యా రెడ్డి అనసూయ వస్త్రధారణపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. అనసూయ విప్పుకు తిరిగినా తనకు అభ్యంతరం లేదని.. కాకపోతే ఆమె అలా అర్థనగ్న దుస్తుల్లో ఫోటోలు దిగి అవి తన ప్రైవేట్‌గా పెట్టుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్‌కి చూపిస్తూ చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ తప్పుడు కూత కూసిన శివాజీని మహిళా కమిషన్ పిలిచి సారీ చెప్పించినప్పుడు.. ఇలాంటి దుస్తులు వేసుకుని మగవారిని రెచ్చగొడుతున్న వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోరు అని ప్రశ్నించారు.
దీనిపై అనసూయ స్పందిస్తూ.. మరో వీడియో రిలీజ్ చేసారు. నేను నా తిండి నేను సంపాదించుకుంటూ తింటున్నాను. కానీ కొందరు పరాన్నజీవులు పక్కనోడి పరువు తీసి సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లు నన్నేమీ పీకలేరు. అంత చక్కటి చీర కట్టుకుని ఆ కంపు నోరేసుకుని పడిపోవడం ఏంటి? పారాసైట్స్‌కి బదులు పారాచ్యూట్స్ అంట అంటూ పగలబడి నవ్వారు. తిరిగి సమాధానం చెప్పడానికి తన వద్ద బోలెడంత ఉన్నా కూడా మౌనంగా ఉన్నందుకు తనకు అవార్డు ఇవ్వాలని అన్నారు.





