Richest Minister Daughter: పై ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? చూడటానికి చక్కగా అందంగా ఉంది కదూ..! ఆమె మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి యువరాణి. ఇంతకీ ఈమె ఎవరి కూతురో తెలుసా? భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు విమానయాన శాఖకు మంత్రిగా పనిచేసిన జ్యోతిరాదిత్య సింథియా కూతురు. పేరు అనన్య సింథియా. వీరిది గ్వాలియర్ రాజకుటుంబం. మనదేశంలో ఇప్పుడు రాజుల పాలన లేకపోయినప్పటికీ రాజస్థాన్, మైసూర్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ రాజ వంశస్థుల హవా నడుస్తూనే ఉంది.
మైసూరులో రాజకుటుంబం లాగే గ్వాలియర్‌లోని సింథియా రాజకుటుంబానికి మంచి ప్రాముఖ్యత ఉంది. జ్యోతిరాదిత్య సింథియా, మహారాణి ప్రియదర్శిణి రాజేలకు ఇద్దరు సంతానం. ఒక బాబు, పాప. అమ్మాయి పేరు అనన్య. అబ్బాయి పేరు మహానార్యమాన్. అయితే ఇప్పుడు అనన్య గురించే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే.. అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని అమెరికాకి వెళ్లిపోయింది. గ్వాలియర్ యువరాణిలా కాకుండా సాధారణ అమ్మాయిలా లింక్డిన్‌లో ఖాతాను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అనన్య న్యూయార్క్‌లో గూగుల్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తోంది. గూగుల్‌లో జాయిన్ అవ్వడానికి ముందు స్నాప్ చాట్, యాపిల్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది.
Richest Minister Daughter 2018లో అనన్య లే బాల్ అనే పారిస్ ఫ్యాషన్ ఈవెంట్‌లో కనిపించడంతో తెగ వైరల్ అయిపోయింది. జ్యోతిరాదిత్య సింథియాకి ఇంత అందమైన కూతురు ఉందా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఎకౌంట్స్ క్రియేట్ చేసేసి తెగ వైరల్ చేసేసారు. సింథియా కుటుంబం అంతా గ్వాలియర్‌లోని జై విలాస్ ప్యాలెస్‌లో ఉంటారు. ఈ ప్యాలెట్ విలువ రూ.4000 కోట్ల పైమాటే. 1874లో మహారాజా జయాజీ రావు సింథియా ఈ ప్యాలెస్‌ను ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ అయిన సర్ మైఖెల్ ఫిలోస్ చేత దగ్గరుండి కట్టించారు. 12,40,771 చదరపు అడుగుల్లో ఈ ప్యాలెస్ ఉంది.
దర్బార్ హాల్, 400 గదులు ఉన్నాయి. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. 3500 కిలోల చాండిలియర్‌తో పాటు 500 కిలోల బంగారంతో గోడలను నిర్మించారు. ఈ చాండిలియర్ ప్రపంచంలోనే అత్యంత దృఢమైనది. డైనింగ్ హాలులో ఓ చిన్న వెండి రైలుని తయారుచేయించుకున్నారు. అదే అన్ని వంటకాలను తిప్పుతూ ఉంటుంది. ఈ ప్యాలెస్‌లోని 37 గదులను మ్యూజిలంలా మార్చారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఈ మ్యూజియం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. మిగతా గదులను సింథియా కుటుంబం తమకోసం కేటాయించుకుంది.