Akhanda 2 Success Meet: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా సక్సెస్ మీట్‌ను ఈ నెల 24న కర్నూలులో నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైకో అంటూ మధ్యలో సినీ నటుడు చిరంజీవి టాపిక్ తీసుకురావడం ఎంత రచ్చకు దారి తీసిందో తెలిసిందే.
దీనిపై ఇప్పటివరకు పవన్ స్పందించింది లేదు. కారణం ఏంటో అందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాను అని ఓ సందర్భంలో పవన్ అన్నారు. ఇలాంటి విషయాల వల్ల కూటమిలో చీలికలు ఏర్పడుతున్నాయి అన్న సంకేతాలు ప్రజలకు వెళ్లకుండా అఖండ 2 సక్సెస్ మీట్‌కు పవన్‌ను పిలిచినట్లు అనిపిస్తోంది.





