Donald Trump మిస్టర్ ప్రెసిడెంట్.. దెం****యండి అంటూ డైరెక్ట్‌గా పార్లమెంట్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసారు డెన్మార్క్‌కి చెందిన ఓ రాజకీయ నేత.
ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ని లాక్కోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై యూరోపియన్ పార్లమెంట్‌లో డిబేట్ జరిగింది. డెన్మార్క్‌కి చెందిన యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడైన ఆండర్స్ విస్టీసేన్ ట్రంప్‌పై రెచ్చిపోయారు.
గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదు. కాబట్టి మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్.. దెం****యండి అని వ్యాఖ్యానించారు. గ్రీన్‌ల్యాండ్ దాదాపు 800 ఏళ్లుగా డెన్మార్క్ పాలనలో ఉంది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా గ్రీన్‌ల్యాండ్‌ను లాక్కోలేరని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
యూరప్ డెన్మార్క్‌కి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ట్రంప్ 25% ట్యారిఫ్‌లు పెంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.





