Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్ చమురును ఇరాన్ నుంచి కాకుండా వెనెజ్వెలా నుంచే కొంటుందని ప్రకటించేసారు.
ఇందుకు భారత్ కూడా ఒప్పుకుందని డీల్ కూడా కుదిరిందని ట్రంప్ అనడం గమనార్హం. నిజానికి భారత్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని చమురు శాతం చాలా తక్కువ.
ఇందుకు కారణం అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించడమే. ఆ ఆంక్షలు లేకపోతే భారత్‌కు చమురు సప్లై చేసే దేశాల్లో ఇరాన్ టాప్‌లో ఉండేది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ట్రంప్‌పై సెటైర్లు వేసింది. భారత ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోందో ట్రంపే చెప్పేస్తున్నాడని





