Phil Salt ప్రముఖ ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసారు.
త్వరలో జరగబోయే T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో స్ట్రాంగ్‌గా ఉన్న టీం ఏదన్నా ఉందంటే అది టీమిండియానే అని అన్నారు.
టీమిండియాని ఓడించాలంటే అదృష్టం ఉండాలని తెలిపారు. 2023 ఆగస్ట్ నుంచి టీమిండియా 63 T20I మ్యాచ్‌లలో గానూ 49 మ్యాచ్‌లను గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా నిలిచింది.
టీమిండియాని వేరే గడ్డపై ఓడించడమే కష్టం అనుకుంటే ఈసారి T20 వరల్డ్ కప్ ఇండియాలోనే జరగబోతోందని.. అది ఇంకా డేంజరస్ అని తెలిపాడు.
అభిషేక్ శర్మ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడని.. తొలి బంతిలోనే సిక్సర్ బాదేస్తాడని అన్నాడు.
India’s T20 World Cup 2026 schedule
ఫిబ్రవరి 7 నుంచి మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.
గ్రూప్ ఏలో టీమిండియా పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, USAలతో ఆడనుంది.
తొలి మ్యాచ్ USAతో జరగనుంది.





