Search The Query
Search

Image

డ‌బ్బులేవీ?

Money Saving Tips సాల‌రీ ప‌డింది. రెంట్ క‌ట్టేసాం. EMI క‌ట్టేసాం. మ‌ళ్లీ వచ్చే నెల‌లో ప‌డే సాల‌రీ కోసం ఎదురుచూడాలి. ఇంతేగా దాదాపు అంద‌రి ప‌రిస్థితి?

ఈ ఖ‌ర్చుల నుంచి ఎటూ త‌ప్పించుకోలేం. కనీసం ఇంప‌ల్సివ్ షాపింగ్ నుంచైనా త‌ప్పించుకునేందుకు య‌త్నించాలి. అప్పుడే నెల పూర్త‌య్యే స‌రికి క‌నీసం ఎంతో కొంత‌ అయినా దాచుకోగ‌లం. అదెలా సాధ్యం?

మీకు ఒక విష‌యం తెలుసా? ఎంత కాద‌న్నా మీరు ప్ర‌ధాన బిల్లుల‌పై ఖ‌ర్చు పెట్టేదాని కంటే ఎక్కువ‌గా ఇంప‌ల్సివ్ షాపింగ్ మీద ఖ‌ర్చుపెడుతుంటారు.

కావాలంటే ఒక‌సారి ప‌రిశీలించుకోండి. ఒక రోజు మొత్తంలో ఏం కొన్నారో అన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. అది ఎంత చిన్న ఖ‌ర్చైనా స‌రే. రాసుకోండి. అప్పుడే తెలుస్తుంది. మ‌న డ‌బ్బులు మ‌న‌కు తెలీకుండానే మ‌నం ఎలా ఖ‌ర్చు చేసేస్తున్నామో.

మీకు ఏద‌న్నా కొనుక్కోవాల‌ని ఉంద‌నుకోండి. ఉదాహ‌ర‌ణ‌కు ఆడ‌వాళ్లైతే ఏద‌న్నా డ్రెస్ కానీ లిప్‌స్టిక్ కానీ ఏద‌న్నా జ్యువెల‌రీ కానీ.. అబ్బాయిలైతే వాచెస్, మొబైల్స్, వాలెట్స్ ఇలా ఏదైనా స‌రే.. కొనుక్కోవాల‌నిపిస్తే ఒక 24 గంట‌లు ఆగండి.

ఆ త‌ర్వాత దాదాపుగా అది కొనుక్కోవాల‌న్న ఆస‌క్తి కూడా ఉండ‌దు. ఒక‌వేళ 24 గంట‌ల త‌ర్వాత కూడా అది కొనుక్కోవాల‌నుకుంటే అప్పుడు తీసుకోండి.

సేవింగ్స్ చేసుకోమంటే ఎంజాయ్‌మెంట్‌ని ప‌క్క‌న పెట్ట‌మ‌ని కాదు. ఆ ఎంజాయ్‌మెంట్ మీరు చేసే సేవింగ్‌ని మించిపోకూడ‌దు అని మాత్రం గుర్తుపెట్టుకోండి.

కావాలంటే ఎంజాయ్‌మెంట్ ప‌ర్ప‌స్ కోసం కేవ‌లం ఇంత మాత్ర‌మే ఖర్చు చేయాల‌ని ఆ మొత్తాన్ని ప‌క్క‌న పెట్టుకోండి. ఆ మొత్తం దాట‌కుండా చూసుకోండి. ఒక వారం ఇలా ప్ర‌య‌త్నించి చూడండి.

సాల‌రీ అంతా వాడేసాక చివ‌ర్లో ఎంత మిగిలితే అంత సేవ్ చేసుకోవ‌డం కంటే సాల‌రీ రాగానే కొంత మొత్తాన్ని ఆటోమేటిక్‌గా సేవింగ్స్ ఖాతాలోకి డెబిట్ అయ్యేలా చూసుకోండి.

ఎన్ని చెప్పినా డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాం. ఎంత వ‌ద్దు అనుకున్నా ఏదో ఒక‌టి వ‌చ్చి ప‌డుతూనే ఉంది. డ‌బ్బు అలా వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆవిరైపోతోంది అనుకుంటే మాత్రం ఎవ‌డూ ఏమీ చేయ‌లేడు. ఏదైనా అనుభ‌వంతోనే క‌దా మ‌నం పాఠాలు నేర్చుకునేది. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • vipph16 says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Vipph16, what’s up! Logging in and playing is easy. Got a few wins already. The site is smooth and secure. I hope you enjoy this platform as much as I do! Click here vipph16
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top