Lakshmi Parvathi ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ క్షణాన ఏ రోజున పోతాడో తెలీదని.. 80 ఏళ్ల వయసులో దేవుడిని అడ్డం పెట్టుకుని ఇంత నీచమైన రాజకీయం చేయాలా అని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సీబీఐ అధికారులు చెప్తున్నప్పటికీ జంతు కొవ్వు పంది కొవ్వు ఉందని మాటిమాటికీ ఆరోపించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఎటూ మోసగాడే కానీ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు బానిసలా ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు.
రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు కానీ న్యాయంగా ప్రజల మనసు గెలుచుకుని అధికారంలో ఉండాలి కానీ ఇలా దేవుడి పేరు వాడుకుని రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్లని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు లాంటి క్రూర జంతువుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మండిపడ్డారు.
ఆ నీచ రాజకీయాలను ఇప్పుడు కొడుకు లోకేష్‌కి బానిస పవన్‌కు నేర్పుతున్నాడని.. 2029లో అందరి సంగతులు తేలుస్తామని హెచ్చరించారు.





