Politicians Died in Plane crashes మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఉదయం చార్టెర్డ్ విమానం కూలడంతో దుర్మరణం చెందారు.
ఇలా విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ గాల్లోనే ప్రాణాలు వదిలిన భారతీయ రాజకీయ నేతలు ఎవరో చూద్దాం.
Vijay Rupani (2025)
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా కమర్షియల్ విమానం టేకాఫ్ తర్వాత కూలిపోవడంతో చనిపోయారు.
ఆ సమయంలో విమానంలో 180 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే బతికి బయటపడ్డాడు..
Dorjee Khandu (2011)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.
Y. S. Rajasekhara Reddy (2009)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నల్లమల అడవుల్లో హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కూలి చనిపోయారు.
G. M. C. Balayogi (2002)
లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.
Madhavrao Scindia (2001)
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పౌర విమానయాన మంత్రి అయిన మాధవరావు సింధియా ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ సమీపంలో ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురికావడంతో చనిపోయారు.
Sanjay Gandhi (1980)
కాంగ్రెస్ నేత, ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ.. ఢిల్లీలో తానే నడుపుతున్న ప్రైవేట్ విమానం కూలి మృతిచెందారు.





