Pakistan ఉన్నమాటంటే ఉలుకెక్కువ అని పెద్దలు ఊరికే అన్నారా..! పాకిస్థాన్‌కు ఈ సామెత ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది.
కరుడుగట్టిన ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ లా అండ్ ఆర్డర్ గాలికొదిలేసి ఎప్పుడెప్పుడు భారత్‌ను టార్గెట్ చేద్దామా అని రెడీగా ఉండే పాక్‌పై ఓ మంత్రి కూతురు, అల్లుడు షాకింగ్ ట్వీట్ చేసారు.
ఆ ట్వీట్ వైరల్ అవడంతో పాక్ కోర్టు వారికి 17 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. మాజీ పాక్ మంత్రి షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ జైనాబ్, ఈమె భర్త హదీ అలీ మానవ హక్కుల న్యాయవాదులుగా పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇమాన్ జైనాబ్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. దేశంలో మానవ హక్కులు అనేవి జోక్ అయిపోయానని.. సాధారణ ప్రజల్లో మిలిటరీ జోక్యం చేసుకుంటోందని.. ఇదొక ఉగ్రవాద దేశంగా మారిపోతోందని అన్నారు.
ఈ ట్వీట్‌పై పాక్ సైబర్ చట్టం PECA ఆగ్రహం వ్యక్తం చేసింది. పుట్టిన దేశంపై ఇలాంటి పోస్ట్ పెట్టినందుకు ఇమాన్‌ను ఆమె భర్తను కోర్టుకు ఈడ్చి మరీ 17 ఏళ్ల కారాగార శిక్ష పడేలా చేసింది.





