Vandemataram భారతదేశ జాతీయ గీతమైన జనగణమన ఆలపించేటప్పుడు అందరూ నిలబడాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. త్వరలో వందేమాతరానికి కూడా నిలబడాలన్న ప్రకటనను కూడా పరిశీలిస్తోంది.
రచయిత బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ తాను రాసిన ఆనంద్ మఠ్ నవలలో వందేమాతరం గేయాన్ని రచించారు. 1950లో ఈ గేయాన్ని జాతీయ గీతంగా దత్తత తీసుకున్నాం.
ఈ పాటను కంపోజ్ చేసి 150 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ ఈ గీతాన్ని ఆలపించేటప్పుడు కూడా జాతీయ గీతంలా నిలబడాలని భావిస్తోంది.
అయితే.. జాతీయ గీతం ఆలపించేటప్పుడు ఎవరైనా లేచి నిలబడకపోతే జాతీయ గౌరవ అవమానం నిరోధక చట్టం, 1971 చట్టం ప్రకారం శిక్షపడుతుంది. కానీ ఇలాంటి చట్టం వందేమాతరానికి మాత్రం లేదు.
అయితే.. ఈ విషయం ప్రస్తుతం రాజకీయ చర్చగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కావాలనే ఈ అంశాన్ని లేవనెత్తుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
మరోపక్క వందేమాతరంలోని తొలి రెండు లైన్లను మాత్రమే పాడితే సరిపోతుందని.. పాటలోని మిగతా లైన్లన్నీ కూడా హిందు దేవతల పేర్లతో నిండి ఉందని పలు ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.





