T20 World Cup ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడినట్లే ఉంది ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ టీం పరిస్థితి. ఈ మాట మాజీ టీమిండియా కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ అన్నారు. ఆయన ఈ మాట అనడం వెనుక ఓ కారణం ఉంది.
T20ల్లో టీమిండియా అదరగొడుతోంది. T20ల్లో ఇతర టీమ్స్ కూడా ఇండియా అంటే భయపడుతున్నాయని ఆయన అన్నారు. వేరే టీమ్స్ ఇండియాను ఎదుర్కొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి.
ఇలాంటి సమయంలో T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ పాక్ ఆడితే ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుందని అన్నారు.
ప్రస్తుత T20I సిరీస్‌లో టీమిండియా న్యూజిల్యాండ్‌ను చితక్కొడుతోంది. 15.2, 10 ఓవర్లలోనే 209, 154 పరుగులు తీసి రికార్టులు సృష్టించింది. ఇవి T20 చరిత్రలోనే ఫాస్టెస్ట్ చేజ్‌లని చెప్పుకోవాలి.
ఈ క్రెడిట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మకే దక్కాలి. సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్‌తో చితక్కొడుతుంటే అభిషేక్ 14 బంతుల్లో అర్థ సెంచరీ బాదేసాడు.
స్ట్రైక్ రేట్ కూడా 195 పైగానే ఉంది. అభిషేక్ శర్మకు బౌలింగ్ వేయాలంటే ఏ సైడ్ నుంచి వేయాల్రా దేవుడా అని బౌలర్లు బెదురుతున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో ICCని బెదిరిస్తూ మేం టీ20 ప్రపంచ కప్ ఆడం అంటూ పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వి కీలక వ్యాఖ్యలు చేసాడు.
తీరా చూస్తే పాక్ ఆల్రెడీ తమ స్వ్కాడ్‌ను అనౌన్స్ చేసేసింది. ఈ నేపథ్యంలో వెనకడుగేస్తే బాగోదు అంటూ ICC పాక్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేసింది.
సో.. టీ20 ప్రపంచ కప్‌లో పాక్ కూడా ఆడుతున్న నేపథ్యంలో క్రిస్ శ్రీకాంత్ వారిని ఎగతాళి చేస్తూ చురకలంటించారు.





