Viral News హత్యలు చేసి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటామని కోర్టుకు చెప్పడంతో వారిని పెరోల్‌పై విడుదల చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కి చెందిన ప్రియా సేఠ్ అనే యువతి 2023లో టిండర్ డేటింగ్ యాప్ ద్వారా ఓ బడా వ్యాపారవేత్తను వల్లో వేసుకుని అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది.
ప్లాన్ ఫెయిల్ కావడంతో అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేసింది. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017లో అల్వార్ ప్రాంతానికి చెందిన హనుమాన్ ప్రసాద్ అనే వ్యక్తి ఆల్రెడీ వివాహమైన మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు.
భర్త, పిల్లలు అడ్డుగా ఉన్నారని అతన్ని, అతని ముగ్గురు పిల్లలతో పాటు మరిది కూడా చంపేసాడు. ఈ కేసులో భాగంగా ఇతను కూడా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
2025లో వీరిద్దరినీ జైపూర్ సెంట్రల్ జైలు నుంచి సంగనేర్ ఓపెన్ జైలుకు తరలించారు. ఈ జైలు రూల్స్ ప్రకారం ఖైదీలు బయటికెళ్లి పని చేసి మళ్లీ సాయంత్రానికి జైల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అలా ప్రియా, ప్రసాద్‌లకు బంధం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వీరిద్దరూ జైల్లోనే సహజీవనం చేస్తున్నారట. పెళ్లి చేసుకుంటామని కోర్టుకు విన్నవించుకోవడంతో ఇద్దరికీ 15 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేసారు.
ప్రసాద్ పుట్టిన ఊరిలోనే పెద్దల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఈ విషయం బయటికి రావడంతో హత్యకు గురైన వ్యాపారవేత్త కుటుంబం పెరోల్ ఎలా ఇస్తారంటూ కోర్టులో పిటిషన్ వేసింది.





