Prabhas ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషిని ముంచేస్తుంది అనడానికి రాజా సాబ్ సినిమానే ఓ నిదర్శనం. రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆయన ఇంట్రోవర్ట్. ఒక దర్శకుడు తన వద్దకు వచ్చి ఏ కథ చెప్పినా నో చెప్పడం రాక చేసేద్దాం డార్లింగ్ అని ఓకే చెప్పేస్తుంటారు. ప్రభాస్ నుంచి వచ్చిన రాధే శ్యాం, ఆదిపురుష్, రాజా సాబ్ సినిమాలే ఇందుకు నిదర్శనం.
ఈ మూడు సినిమాలు ప్రభాస్ అభిమానులకు పీడకలల్లా మారాయి. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్‌ను మళ్లీ ఎనర్జిటిక్ రోల్‌లో చూస్తాం అనుకుంటే అసలు సినిమాలో ఏముందబ్బా చూడటానికి అనేలా తీసారని దర్శకుడు మారుతిపై మండిపోతున్నారు అభిమానులు.
పైగా మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.. నచ్చకపోతే క్షమించండి అని సింపుల్‌గా చెప్పి ఊరుకోవాల్సింది.
కానీ ఆయన ఓవరాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమా బాలేకపోతే తన ఇంటికి వచ్చి నిలదీయండి అంటూ ఏకంగా అడ్రెస్ ఇచ్చేసారు. తీరా చూస్తే సినిమా యావరేజ్ టాక్ అందుకోగా.. ఫ్యాన్స్ ఆయన ఇంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బూతులు తిడుతున్నారు.
ఇంకొందరైతే లంగాలతో పాటు కొన్ని వస్తువులను ఆర్డర్ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి మరీ ఆయన ఇంటికి పార్సిల్స్ పంపుతూ టార్చర్ పెడుతున్నారు.
పోనీ ఇప్పుడైనా మారుతి సారీ చెప్తూ ఫ్యాన్స్‌ని కూల్ చేసేందుకు ఏదన్నా ప్రెస్ రిలీజ్ కానీ ట్వీట్ కానీ చేసారా అంటే అదీ లేదు.
ఇలాంటివేమీ చేయకపోగా.. సినిమాను ఒకసారి చూస్తే ఏమీ అర్థం కాదని… రెండోసారి చూస్తేనే కథలో ఏముందో అర్థమవుతందని మరోసారి చూడాలంటూ ట్వీట్ చేయడం పుండుపై కారం చల్లినట్లయ్యింది.
దాంతో ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయాలంటే దర్శకులు వణుకుతున్న పరిస్థితి. ఎందుకంటే సినిమా సరిగ్గా రాకపోతే దర్శకులను రఫ్ఫాడించేస్తున్నారు రెబెల్ అభిమానులు.





