Vijaya Sai Reddy వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న కోటరీని ఇంకా నమ్ముకుంటే మాత్రం 2029లో కాదు కదా ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని అన్నారు పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి.
నిన్న విజయసాయి రెడ్డి లిక్కర్ కేసు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను ఏ2గా ఎప్పుడూ లేనని.. 2020 నుంచే తనను పక్కకు పెట్టేసారని అన్నారు.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అప్రూవర్‌గా మారేదే లేదని తెలిపారు. ఇంకా తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని.. వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చేరతానో లేదో చెప్తానని అన్నారు.
జగన్ అధికారంలోకి రావాలంటే తానే స్వయంగా పార్టీలో ఉన్న కొందరి మాటలు వినకుండా ఉండాలని.. ఆ కోటరీ, కూటమి రెండూ లేకపోతేనే జగన్ అధికారంలోకి వస్తారంటూ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాట్లాడారు.
పైగా ఎప్పుడూ లేనిది ప్రధాని నరేంద్ర మోదీ బెస్ట్ అని అన్నారు.





