Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • అన్న సినిమాకు శుభాకాంక్ష‌లు

అన్న సినిమాకు శుభాకాంక్ష‌లు

0Shares

Pawan Kalyan మెగా బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ శుభాకాంక్షలు తెలిపింది.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంచలనాలు సృష్టించారు. తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.

మెగా అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా మలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి సినీ ప్రయాణంలో అతి పెద్ద విజయంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.

“మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు అత్యంత దగ్గరగా నిలుస్తూ.. అదే తపన, అదే ఉత్సాహంతో తన నటన, హాస్యం, నృత్యాల ద్వారా ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్నారు.

ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు.

సంక్రాంతికి మరో ఘన విజయాన్ని అందించిన ఆయన ప్రతిభ ప్రశంసనీయమైనది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే తెరపై కలిసి కనిపించడం ప్రేక్షకులకు నిజంగా అపూర్వ ఆనందాన్ని కలిగించింది.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో గారు అందించిన అద్భుతమైన సంగీతం, సినిమాకు మరింత శక్తిని జోడించింది.

ప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యే చిత్రాన్ని అందించిన నిర్మాతలు సాహు గారపాటి గారు, సుష్మిత గారికి కూడా ప్రత్యేక అభినందనలు.

ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగమైన నయనతార గారు, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు.” అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.

మొత్తం మీద ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత కూడా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ చిత్రం సాధించిన అద్భుత విజయం పట్ల సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

More News

Jagan reponds to ap assembly speaker ayyannapatrudu
“జీతాల‌పై ఆధార‌ప‌డేంత పేదోళ్లు కాదు మావాళ్లు”
BySai KrishnaJan 22, 2026

Jagan అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల‌కు జీతాలు ఇవ్వ‌డం స‌రికాద‌ని ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి…

Guntur woman kills husband and watches porn beside his body
భర్తను చంపి రాత్రంతా పోర్న్
BySai KrishnaJan 22, 2026

Guntur గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివన‌గ‌రాజు అనే వ్యక్తికి 2007లో లక్ష్మీ…

will jagan at least now stick to his words regarding padayatra
నిజ‌మేనా న‌మ్మ‌చ్చా?
BySai KrishnaJan 22, 2026

Jagan వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఏడాది నుంచి పాద‌యాత్ర…

who will Pawan Kalyan select as Rajya sabha MP
ఆ త‌ప్పు చేయ‌కు ప‌వ‌న్
BySai KrishnaJan 22, 2026

Pawan Kalyan రాజ్య‌స‌భ‌లో జూన్ నాటికి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటిలో మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవి..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top