Alimony ఓ వ్యక్తి చాలా తెలివిగా భరణం ఎగ్గొట్టి ప్రేయసితో ఉందామని ప్లాన్ వేసాడు. కానీ కోర్టు అతనికి కోలుకోలేని షాకిచ్చింది. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది.
కెనడాలో ఓ టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న స్టీఫెన్ అనే వ్యక్తి తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఇందుకు కారణం అతనికి వేరొక అమ్మాయితో పరిచయం అవడమే. స్టీఫెన్ తన భార్యతో కలిసి నలుగురు పిల్లల్ని కన్నాడు.
ముందు వీరు సింగపూర్‌లో ఉండేవారు. ఆ తర్వాత ఉద్యోగ రిత్యా స్టీఫెన్ కెనడా వెళ్లాల్సి వచ్చింది. కెనడాలో స్టీఫెన్ ఏడాదికి రూ.6 కోట్లు సంపాదించేవాడు. ఈ నేపథ్యంలో స్టీఫెన్ మరో అమ్మాయిని లైన్‌లో పెట్టాడు. ఆమెతో ఉండేందుకు భార్య నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కెనడాలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ.. ఏడాదికి భరణం కింద రూ.4 కోట్లు ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయితే.. ఎక్కడ మెయింటైనెన్స్, భరణం ఇవ్వాల్సి వస్తుందో అని కోర్టు నుంచి తీర్పు రావడానికి ముందే స్టీఫెన్ కెనడాలో తాను చేస్తున్న ఉద్యోగం మానేసి ప్రేయసి వద్దకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోర్టు నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్లలేదు.
దాంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇక చేసేదేం లేక కెనడాలోనే వేరే ఉద్యోగంలో చేరాడు. కానీ అక్కడ వారు ఏడాదికి రూ.2 కోట్ల జీతం మాత్రమే ఇస్తున్నారు. ఇదే విషయాన్ని స్టీఫెన్ తరఫు న్యాయవాది కోర్టుకు వినిపించాడు.
ఇప్పుడు స్టీఫెన్ జీతం చాలా తక్కువ అని నెల నెలా రూ.18 లక్షలు మెయింటైనెన్స్ ఇచ్చుకోలేడని.. అదీకాకుండా స్టీఫెన్ భార్య అతని జీతాన్ని కాస్మెటిక్స్‌కి లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి వినియోగిస్తోందని అన్నాడు.
దీనిపై వాదోపవాదాలు విన్న కోర్టు.. సరిగ్గా మెయింటైన్స్ ఇవ్వాల్సి వస్తుందన్న సమయంలో స్టీఫెన్ ఉద్యోగం మానేయడం ప్లాన్ ప్రకారం చేసినట్లుందని.. ఇప్పుడు జీతం ఏడాదికి రూ.2 కోట్లు కాబట్టి.. నెల నెలా మెయింటైన్స్ కింద రూ.18 లక్షలు కాకుండా రూ.11 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
స్టీఫెన్ భార్య కూడా కెనడాలో ఏదన్నా ఉద్యోగం చేస్తూ తన అవసరాలకు తన డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మంచిదని వెల్లడించింది.





