Divorce విడాకులు తీసుకున్నాక మళ్లీ ఆ జంట మధ్య ప్రేమ చిగురిస్తే కలిసిపోవచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ ఈ దేశంలో మాత్రం ఒక్కసారి కోర్టు విడాకులు మంజూరు చేసాక మళ్లీ కలిసిపోతే మాత్రం జైల్లో చిప్ప కూడు తినాల్సిందే.
ఇంతకీ ఆ దేశం ఏంటంటే.. మలేసియా. మలేసియా రాజ్యాంగం ప్రకారం అక్కడ రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి సివిల్ రెండోది షరియా. షరియా చట్టం అనేది ముస్లింలకు సంబంధించినది అని మనకు తెలిసిందే.
షరియా చట్టం ప్రకారం.. ముస్లిం జంట విడాకులు తీసుకున్నాక మళ్లీ ఓ హోటల్లోనో లేదా ఏకాంతంగా కలిస్తే మాత్రం దానిని ఖల్వాత్ అంటారు. ఖల్వాత్ ప్రకారం ఇది నేరం. ఇలా చేస్తే వారిని జైల్లో పెడతారు.
మలేసియాకి చెందిన ఓ ముస్లిం జంటకు ఎదురైన పరిస్థితి ఇదే. వారిద్దరూ షరియా చట్టం ప్రకారం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ఒకసారి కలవాలని నిర్ణయించుకుని హోటల్‌కు వెళ్లారట. ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ జంట ఉన్న హోటల్‌పై రెయిడ్లు చేసి వారిని అరెస్ట్ చేసారు.
షరియా చట్టం ప్రకారం.. వారిద్దరూ మళ్లీ కలుసుకోవాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి కాకుండా ఊరికే కలవడం కూడా అక్కడ నేరమే.





