Renu Desai హైదరాబాద్‌లో వందలాది కుక్కలకి విషం పెట్టి చంపుతున్న ఘటనలు ఎక్కువైపోతుండడంతో తొలిసారి నటి రేణూ దేశాయ్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు.
దోమలు కుట్టి మలేరియాతో లక్షలాది ప్రాణాలు కోల్పోతుంటే ఎలాంటి ఆందోళనలు, ర్యాలీలు చేయరు కానీ ఒక కుక్క కరిచి మనిషి పోతే మాత్రం వందలాది కుక్కలు కారణం అంటూ మూగజీవుల్ని దారుణంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
అలాంటప్పుడు ఆడవాళ్లను మగాళ్లే రేప్ చేస్తున్నప్పుడు అందరు మగాళ్లని ఎందుకు చంపడం లేదు అని ప్రశ్నించారు. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు పక్షపాతంగా వ్యవహరించిందని.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగతంగా ఉందని ఆరోపించారు.
తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు తనను జైల్లో పెట్టినా పట్టించుకోనని అన్నారు. రోడ్ల మీదకు వచ్చి తాను ఎన్నో వీధి కుక్కలను పట్టుకున్నాను కానీ ఇప్పటివరకు తనను ఏ కుక్క కరవలేదని.. దీని అర్థం కుక్కల విషయంలో ఇప్పుడు రెచ్చిపోతున్న కొందరు వాటిని కొట్టడాలు ఇరిటేట్ చేయడాలు వంటివి చేస్తున్నారు కాబట్టే అవి కరుస్తున్నాయని అన్నారు.
కుక్కలు కరుస్తున్నాయి లేదా ఫలానా వీధిలో ఓ పిచ్చి కుక్క ఉందని తెలిస్తే తన లాంటి ఎన్జీవోలను నడిపే వారిని సంప్రదిస్తే ఏదో ఒకటి చేస్తామని.. అంతేకానీ కుక్కని చంపే హక్కు ఎవ్వరికీ లేదని అన్నారు.
మనుషుల్లాగే మూగజీవాలను కూడా దేవుడు పుట్టించినవే అని వాటిని చంపితే కచ్చితంగా కర్మఫలితం అనేది ఇలా చేస్తున్నవారి పిల్లలు కుటుంబాలు అనుభవించి తీరతాయని మండిపడ్డారు.





