YSRCP Naga Malleswari తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచచి తీరతారని.. అప్పుడు ఛానెల్ ఎక్కడుంటదో రాధాకృష్ణ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత మంచ నాగమల్లీశ్వరి. ఛానెల్‌ను కేవలం జగన్‌ను తిట్టడం కోసమే పెట్టుకున్నట్లు ఉందని.. ఆడవాళ్లపై దరిద్రమైన థంబ్‌నెయిల్స్ పెట్టి ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నామని అన్నారు. జగన్ అన్న అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణకి, మెంటల్ కృష్ణ (న్యూస్ రీడర్ వెంకట కృష్ణ)కు బడితె పూజ ఉంటుందని హెచ్చరించారు.
మనిషన్నవాడికి ఒకసారి లేదా రెండు సార్లు చెప్తామని.. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని పెద్దలు ఊరికే అనలేదని మండిపడ్డారు. ఇంకోసారి జగన్‌ను టార్గెట్ చేస్తూ వార్తలు చదవడం.. పెన్షన్ తీసుకునే వయసుకు వచ్చిన నలుగురు ముసలోళ్లని డిబేట్‌లో కూర్చోబెట్టి వారి చేత చెత్త వాగుడు వాగించడం లాంటివి చేస్తే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి బుద్ధి చెప్పడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. రాధాకృష్ణ ఏపీకి వస్తే ప్రజలు రానివ్వరని.. జగన్ అన్న ప్రభుత్వం వచ్చే వరకైనా అణిగిమణిగి ఉంటే మంచిదని అన్నారు.





