Bharatha Mahasayulaku Vignapthi మాస్ మహారాజా రవితేజ మరోసారి మాస్ ఎంటర్టైనర్తో మన ముందుకు రాబోతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతిలు నటించారు. అయితే.. అసలు ఈ సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ దర్శకుడు కిశోర్ తిరుమల చేసిన వ్యాఖ్యలు నెట్టింట రచ్చ అవుతున్నాయి.
రవితేజతో ఓ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆయన్ను కలిసి ఓ కథ చెప్పానని.. ఆయన సినిమాలో తాను ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోవాలని ఐడియా ఇచ్చారని అలా ఈ సినిమా కథను రాసుకున్నానని తెలిపారు. అయితే.. రవితేజ వయసుకు తగ్గ సినిమాలు కాకుండా ఇలా హీరోయిన్ల మధ్య నలిగిపోవాలి అదిరిపోవాలని అని దర్శకులకు చెప్పి మరీ అలాంటి సినిమాలు తీయిస్తుండడం ఎంత వరకు సమంజసం అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.





