Cricket: ఈరోజుతో 2025కి గుడ్‌బై చెప్పేస్తున్నాం. రేపటి నుంచి కొత్త ఆశలతో 2026కి స్వాగతం పలకబోతున్నాం. 2025 ఎన్నో రంగాలకు మర్చిపోలేని అనుభూతులను ఇచ్చింది.. జీర్ణించుకోలేని బాధలను కూడా ఇచ్చింది. అయితే.. మన దేశంలో ఆడ, మగ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకునే క్రికెట్ రంగానికి 2025 మెమొరబుల్ ఇయర్‌గా చెప్పుకోవాలి. ఈ 2025 క్రికెట్ రంగంలో చోటుచేసుకున్న పది సంఘటనలతో దద్దరిల్లింది. అవేంటో తెలుసుకుందాం.
T20Iల్లో తొలి 8 వికెట్లు
భూటాన్‌కి చెందిన క్రికెటర్ సోనమ్ యెషే 4 ఓవర్లలో కేవలం 7 పరుగుల్లో 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. T20 చరిత్రలో ఇది బెస్ట్ బౌలింగ్ మూమెంట్‌గా నిలిచింది.
ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు
ఇండోనేషియాకు చెందిన గెడె ప్రియాండానా T20Iలో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు
గ్లాస్గోలో నేపాల్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత ఫస్ట్ సూపర్ ఓవర్, సెకండ్ సూపర్ ఓవర్ కూడా టై అయ్యాయి. మూడో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ గెలిచింది.
6000 WTC పరుగులు
ఇంగ్లాండ్‌కి చెందిన జో రూట్ ఆగస్ట్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు.
ఫాస్టెస్ట్ ఐదు వికెట్లు
టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకి చెందిన మిచెల్ స్టార్క్ కొత్త రికార్డు నెలకొల్పాడు. వెస్ట్ ఇండీస్‌పై కేవలం 15 బంతుల్లో ఐదు వికెట్లు తీసాడు. మెన్స్ టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
ఏడు డకౌట్స్
ఒకే టెస్ట్ ఇన్సింగ్స్‌లో వెస్ట్ ఇండీస్ తడబడింది. సింగిల్ టెస్ట్ ఇన్నింగ్స్‌లో 7 డకౌట్స్ రుచి చూసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు.
RCB కప్పు గెలిచింది
18 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతూ ఒక్కసారి కూడా కప్పు కొట్టని RCB ఈ ఏడాది కప్పు గెలిచి చూపించింది.
దక్షిణాఫిక్రా తొలి WTC గెలుపు
లార్డ్స్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలిచి తొలి WTC టైటిల్ గెలిచింది. ఎయిడెన్ మక్రామ్ కీలక సమయంలో 136 పరుగులు తీసి దుమ్ముదులిపాడు.
భారత్‌కు మూడో ఛాంపియన్ ట్రోఫీ
ఫైనల్స్‌లో న్యూజిల్యాండ్‌పై గెలిచి భారత్ మూడో ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకుంది. మూడు ట్రోఫీలు దక్కించుకున్న ఏకైక దేశం భారత్.
మన అమ్మాయిలు తొలి ODI వరల్డ్ కప్ కొట్టారు
నవీ ముంబైలో జరిగిన ODI వరల్డ్ కప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ నెగ్గి కప్ సాధించింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మలు అదరగొట్టేసారు. మన అమ్మాయిలకు ఇదే తొలి ODI వరల్డ్ కప్.





