Russia Ukraine War: ఒక్క పోస్ట్.. ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్.. ఓ బిలియనేర్కు 80 వేల కోట్ల నష్టాన్ని తెచ్చి దాదాపు రోడ్డుపైన వేసేసింది. మరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పెట్టుకుంటే ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. ఇది ఇప్పట్లో ఆగేలా లేదని.. దీని వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెత్తి బాదుకుంటూనే ఉన్నారు. అయినా ఇరు దేశాల అధ్యక్షులు తగ్గేదేలా అంటూ ఒకరిపై ఒకరు బాంబులు విసురుకుంటూనే ఉన్నారు.
సాధారణంగా.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు.. ఏ దేశానికి చెందిన ప్రజలు ఆ దేశాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు.. మనకు పాకిస్థాన్‌కి మధ్య మెరుపు దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటివి జరిగినప్పుడు పాక్ కవ్వింపు చర్యలకు సమాధానంగా చూసామే తప్ప మనమేమీ కావాలని చేసిన దాడులు కావవి. సాధారణ ప్రజలను పక్కన పెడితే… సీనియర్ జర్నలిస్ట్‌లు, సెలబ్రిటీలు శెభాష్ భారత్ అంటూ ట్వీట్స్ చేస్తేనే వారికి గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఈ గొడవలు, మెరుపు దాడుల వల్ల ఒరిగిందేమిటి అని నీతి వ్యాఖ్యలు చేసే వారిని సోషల్ మీడియా నుంచి పారిపోయేలా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ మనం ఎవ్వరినీ సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఎవరి అభిప్రాయం వారిది.
రష్యాకి చెందిన ఒలెగ్ టింకోవ్ అనే వ్యక్తి కూడా ఇలాగే అనుకున్నాడు పాపం. రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్న సమయంలో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టే కదా అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకున్నాడు. ఆ పోస్ట్ వల్ల తన జీవితం తలకిందులు అవుతుందని ఊహించలేకపోయాడు. 2022లో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసినప్పుడు జస్ట్ ఖండించి వదిలేయాల్సింది. కానీ టింకోవ్ అలా చేయకుండా రష్యా మిలిటరీపై అవమానకర వ్యాఖ్యలు చేసాడు. రష్యన్ మిలిటరీలో కుట్ర జరుగుతోందని.. వాళ్లు సరిగ్గా సిద్ధంగా లేనందునే ఉక్రెయిన్ దాడి చేసిందని పోస్ట్ చేసాడు.
ఈ పోస్ట్ ఎవరో ఒక సాధారణ వ్యక్తి చేసి ఉంటే పుతిన్ పట్టించుకోకపోయేవాడు. కానీ టింకోవ్ సాధారణ వ్యక్తి కాదు. రష్యాలో అత్యంత పాపులర్ ప్రైవేట్ బ్యాంక్ అయిన టింకాఫ్ బ్యాంక్‌కు అధినేత. కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ అది. మరి అంతటి పాపులారిటీ ఉన్న బిలియనేర్ తన మిలిటరీని శంకిస్తూ పోస్ట్ చేసే పుతిన్ ఊరుకుంటాడా? వెంటనే క్రెమ్లిన్ నుంచి టింకోవ్కు ఓ నోటీస్ వచ్చింది. టింకోఫ్ బ్యాంకులోని షేర్లను తక్కువ ధరకు అమ్మేసి అతని పేరుని బ్యాంకు ఓనర్షిప్ రికార్డుల నుంచి చెరిపేయాలి.. లేదా ఆ బ్యాంకును రష్యన్ ప్రభుత్వ పరం చేయాలి అని ఆ నోటీసులో ఉంది. బ్యాంకులో పెట్టుబడిదారులు కూడా వణికిపోయారు.
ఇక చేసేది ఏమీ లేక టింకోవ్ తన 35% షేర్లను రష్యాకి చెందిన మరో వ్యాపారవేత్తకు అతి తక్కువ ధరలకు అమ్మేయాల్సి వచ్చింది. దీని వల్ల టింకోవ్కి కలిగిన నష్టం రూ.80,915 కోట్లు. మరి ఇంత జరిగాక టింకోవ్ రష్యాలో ఎందుకుంటాడు? వెంటనే తన పౌరసత్వాన్ని వదులుకుని రష్యాను వదిలేసి కొన్ని నెలలు యూకే, మరి కొన్ని నెలలు ఇటలీలో నివసిస్తున్నాడు. టింకోవ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వల్ల చాలా మంది సామాన్య ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని.. వారంతా రష్యాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టడంతో పుతిన్‌కు మండిందని టాక్ ఉంది. అదీ మ్యాటర్..!





