Shukra Aditya Yogam: డిసెంబర్ 20న శుక్ర ఆదిత్య యోగం ఏర్పడుతోంది. దీని అర్థం ఏంటంటే.. సూర్యుడు, శుక్రుడు ఒకే రాశిలో ఉంటారు. ఈసారి సూర్యుడు, శుక్రుడు కలిసి ఉండే రాశి ధనుస్సు. దీని వల్ల మూడు రాశులకు అదృష్టం పట్టబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఆ మూడు రాశులు ఏంటంటే..
మేష (Aries)
మేష రాశి వారికి ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. కెరీర్‌లో అభివృద్ధి.. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. గతంలో పెట్టుబడులు పెట్టి ఉంటే లాభాలు వస్తాయి.
సింహ (Leo)
ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. కెరీర్‌లో సక్సెస్ అవుతారు. గతంలో ఎక్కడన్నా డబ్బులు ఇరుక్కుని ఉంటే అవి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా.. కొనుగోలు చేయాలనుకున్నా మంచి సమయం.
ధనుస్సు (Sagittarius)
అదృష్టం వరిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. దూర ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి.





