Search The Query
Search

Image
  • Home
  • Spiritual
  • దూరమైనది ఏదైనా తిరిగి మీ వద్దకు చేర్చే శ్లోకం

దూరమైనది ఏదైనా తిరిగి మీ వద్దకు చేర్చే శ్లోకం

అంటే.. పోగొట్టుకున్న‌ది తిరిగి ఇచ్చే శ‌క్తి ఈ మంత్రానికి ఉంద‌న్న‌మాట‌. సాధార‌ణంగా మ‌న ద‌గ్గ‌రున్న వ‌స్తువు ఏదైనా పోతే మ‌నం మ‌న‌కున్న రెండు చేతుల‌తో వెతుకుతూ ఉంటాం. కానీ కార్త‌వీర్యార్జునుడు మాత్రం త‌న‌కున్న వెయ్యి చేతుల‌తో వెతికిపెడ‌తాడ‌ట‌.మ‌రొక‌టి ఏంటంటే.. కార్తవీర్యార్జునుడు సుద‌ర్శ‌నాంశ‌తో జ‌న్మించాడ‌ని ద‌త్త‌పురాణంలో ఉంది. సూ ద‌ర్శ‌నం అంటే బాగా క‌నిపించేలా చేయ‌డం అని అర్థం. అందుకే ఏదైనా పోతే దానిని దొరికిస్తాడు అని న‌మ్ముతారు. ఇది ఊరికే జ‌నాలు చెప్పింది కాదు. శాస్త్ర ప్రామాణిక‌మైన శ్లోకం కూడా ఉంది.

కార్త‌వీర్యార్జునో నామ రాజా బ‌హు స‌హ‌స్ర‌వాన్

త‌స్య సంస్మ‌రణాదేవ నృతం న‌ష్టం చ ల‌భ్య‌తే

కార్తవీర్యార్జున‌డునే ఆయ‌న్ని స్మ‌రిస్తే గ‌నుక పోయిన‌దేదైనా ల‌భిస్తుంద‌ని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం ఎక్క‌డిది అంటే.. ఇది తంత్ర శాస్త్ర గ్రంథంలో ఉంది. పైన చెప్పిన శ్లోకాన్ని సాక్ష్యాత్తు ప‌ర‌మేశ్వ‌రుడే పార్వ‌తి దేవికి చెప్పాడు. అంటే ప‌ర‌మేశ్వ‌రుడే చెప్పాడంటే క‌చ్చితంగా జ‌రుగుతుంది క‌దా..! అందుక‌ని ఈ శ్లోకాన్ని మీ పూజా శ్లోకాల్లో క‌లుపుకుని కుదిరిన‌న్ని సార్లు అలా చేసుకోండి. పోయిన వ‌స్తువులు ఒక్కొక్క‌టీ మీ ద‌గ్గ‌రికి ఏదో ఒక రూపంలో తిరిగి వ‌స్తాయి. ఈ శ్లోకం ఎంత శ‌క్తివంత‌మైన‌దంటే.. గుళ్ల‌ల్లో దొంగ‌లు ప‌డ‌కుండా.. వ‌స్తువులు, విగ్ర‌హాలు, న‌గ‌లు దొంగ‌త‌నాలు కాకుండా ఉండాల‌న్నా కూడా ఆ గుడిలో అర్చ‌కులు ఈ శ్లోకాన్ని రోజూ పూజ‌లో భాగంగా చ‌దివితే కార్త‌వీర్యార్జునుడే ఆ గుడిని కాపాడతాడు.

More News

Reason behind sex idols on Temples
ఆల‌య క‌ట్ట‌డాల‌పై శృంగార బొమ్మ‌లెందుకు?
BySai KrishnaJan 31, 2026

Temples పురాత‌న ఆల‌య క‌ట్ట‌డాల‌పై శృంగార బొమ్మ‌లను మీరూ చూసే ఉంటారు. ఆల‌యంలో ఇలాంటి బొమ్మ‌లా అని మీకెప్పుడైనా అనిపించిందా?…

which zodiac signs are going to benefit from Surya Grahanam 2026
ఈ రాశులు ల‌క్కీ.. వీరు మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే
BySai KrishnaJan 30, 2026

Surya Grahanam ఈసారి సూర్య‌గ్ర‌హ‌ణం శివ‌రాత్రికి ఉగాది మ‌ధ్య‌లో రాబోతోంది. ఈసారి ఏర్ప‌డ‌బోయే గ్ర‌హ‌ణం రింగ్ ఆఫ్ ఫైర్‌లా ఉండ‌బోతోంది.…

Tricolor abhishekam to lord shiva goes viral
త్రివ‌ర్ణంలో త్రినేత్రుడు
BySai KrishnaJan 26, 2026

Shiva నేడు 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఓ ప్రాంతంలోని శివాల‌యంలో లింగానికి త్రివ‌ర్ణాల‌తో అభిషేకం చేయ‌డం వైర‌ల్‌గా మారింది.…

will cardamom plant give financial growth
ఈ మొక్క‌తో సంపాద‌న పెరుగుతుందా?
BySai KrishnaJan 25, 2026

Money Remedies మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనీ వ‌స్తాయ‌నుకునేవాళ్లం. మ‌నీ ప్లాంట్ పెట్టుకుంటే డ‌బ్బు రాదు కానీ ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top