Kadiyam Srihari: తెలంగాణ ఎన్నికల సమయంలో చాలా మంది BRS నేతలు టికెట్‌పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేతలను సస్పెండ్ చేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి వేసిన కేసు సుప్రీం కోర్టులో నడుస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్ చేసారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు సర్ అని ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు.. నాకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి నోటీసులు వచ్చాయని.. తాను ఏ పార్టీలో ఉన్నాడో స్పీకరే చెప్పాలని అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. పార్టీ మారాను అన్నది పచ్చి అబద్ధం అని స్పీకర్‌కు లిఖితపూర్వకంగా లేఖ అందించినట్లు తెలిపారు.





