Mahesh Babu challan fan: అభిమాన నటుల పట్ల ఫ్యాన్స్‌కి ఉండే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి నిరూపించిన ఘటన ఇది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కారుకు రెండు పెండింగ్ చలాన్లు ఉంటే.. వెంటనే వాటిని క్లియర్ చేసాడు ఓ అభిమాని. ఆయన చలాన్లు క్లియర్ చేస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని మరీ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. మహేష్ బాబు తరచూ వాడే రేంజ్ రోవర్ కారు PVNR ఎక్స్‌ప్రెస్ వేపై స్పీడ్ లిమిట్ దాటడంతో రెండు చలాన్లు పడ్డాయి.
ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తుండడంతో ఓ అభిమాని తట్టుకోలేక వెంటనే రూ.2070 చెల్లించి ఆ చలాన్లను క్లియర్ చేసాడు. అభిమానం అంటే వాడిది రా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ఆ డబ్బు నువ్వు దాచుకుంటే భవిష్యత్తులో దేనికైనా ఉపయోగపడుతుంది కదా.. ఆ డబ్బు మహేష్ బాబు దగ్గర లేదనుకుంటున్నావా అంటూ చీవాట్లు కూడా పెడుతున్నారు.
గతంలోనూ సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలకు చెందిన వాహనాలు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా సరదాగా ఎన్ని చలాన్లు ఉన్నాయో చెక్ చేసి మరీ ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో ట్రోల్ చేస్తూ మీమ్స్ వేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఓ అభిమాని ఇలా తన అభిమాన నటుడి పట్ల జరుగుతున్న ట్రోలింగ్ తట్టుకోలేక చలాన్లు కట్టడం అనేది హైలైట్.





