Breakup: ఆరోగ్యం బాలేకపోతేనో.. పండుగలకో బాస్‌ని సెలవులు అడిగే వాళ్లని చూసాం. కానీ బ్రేకప్ అయ్యిందని ఓ ఉద్యోగి తన బాస్‌ని సెలవులు అడగటం ఎప్పుడైనా విన్నారా? ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అయిన జస్వీర్ సింగ్ స్వయంగా లింక్డిన్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాట్ డేటింగ్ అనే కంపెనీలో పనిచేస్తున్న ఓ GenZ అమ్మాయికి బ్రేకప్ అయ్యిందట.
దాంతో అసలు పని మీద దృష్టి పెట్టలేకపోయింది. ఇలాగైతే వర్క్ చేయలేమని భావించి తన బాస్‌కి మెయిల్ పెట్టింది. “” హలో సర్. రీసెంట్‌గా నాకు బ్రేకప్ అయ్యింది. తనని మర్చిపోలేకపోతున్నాను. మైండ్ పనిచేయడం లేదు. వర్క్ చేయలేకపోతున్నాను. నాకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 8 వరకు సెలవులు కావాలి “” అని పేర్కొందట. ఆ మెయిల్ చూసిన వెంటనే జస్వీర్ అదేంటి ఎందుకు అని ఒక్క మాట కూడా అడగలేదు. వెంటనే లీవ్ ఎప్రూవ్ చేసేసాడట. తనకున్న వృత్తిపరమైన అనుభవంలో ఎప్పుడూ ఇలాంటి లీవ్ లెటర్ చూడలేదని.. GenZ యువత తమకు ఏం కావాలి అన్న విషయంలో స్పష్టంగా ఉండటం తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు సెలవులు అడుగుతారా అని కోపడకుండా వెంటనే లీవ్ ఎప్రూవ్ చేసినందుకు లింక్డిన్ మెంబర్స్ జస్వీర్ సింగ్‌ని మెచ్చుకుంటున్నారు.





