Spirit Prabhas ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవుల ఉద్యోగాలు పోతాయని తెగ బెదరగొడుతున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితులను చూస్తే హీరోల ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. అర్థంకాలేదా.. అదేనండీ.. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో స్పిరిట్ అనే సినిమా రాబోతోంది కదా. నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిన్న గ్లింప్స్ ఒకటి వదిలి హైప్ పెంచేసారు వంగా బ్రో. ఇందులో ప్రభాస్ నాకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. అప్పుడే ఫ్యాన్స్ కూడా One Bad Habit అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ స్టార్ట్ చేసేసారు.
అయితే.. ఫ్యాన్స్ ఒక పక్క స్పిరిట్ గ్లింప్స్ హైప్‌లో మునిగి తేలుతుంటే.. దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది. గ్లింప్స్ మొత్తంలో హైలైట్‌గా నిలిచిన ప్రభాస్ వాయిస్ ఆయన సొంతంగా చెప్పిన డైలాగ్ కాదట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రికార్డ్ చేసారని తెలిసింది. దాంతో.. అదేంట్రా బాబూ సినిమా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిపేస్తారా అంటూ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ముందు ముందు సినిమాల్లో తమ అభిమాన హీరోలకు బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన పాత్రలనే చూస్తామేమో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.





