Pawan Kalyan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై, అధికారులతో సమీక్షలు నిర్వహించారట.
సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ తాను నటించిన OG సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరై సందడి చేసారు. ఆ సమయంలో వర్షం పడుతున్నా ఆయన తడుస్తూనే అభిమానులతో ముచ్చటించారు. ఈ ఈవెంట్ తర్వాత వెంటనే నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వరుసగా ప్రయాణాలు చేయాల్సి రావడం.. రాష్ట్రంలో వాతావరణం కూడా చల్లగా ఉండటంతో ఆయనకు వైరల్ ఫీవర్ సోకినట్లు తెలుస్తోంది. పవన్ నటించిన OG సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.