Chandra Grahanam సెప్టెంబర్ 7.. భాద్రపద పౌర్ణమి.. ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం. దాదాపు 3 గంటల 30 నిమిషాల పాటు ఉండబోతోంది. ఈ చంద్రగ్రహణం సందర్భంగా 12 రాశుల్లో చక్రం తిప్పబోతున్న నాలుగు రాశుల గురించి తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 7 రాత్రి వేళలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది.
ఈ చంద్రగ్రహణం అనేది 12 రాశుల్లో నాలుగు రాశుల వారికి బాగా అదృష్టాన్ని కలిగించబోతోంది. ఈ నాలుగు రాశుల వారు ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం తిప్పబోతున్నారు. ఆ నాలుగు రాశులేంటంటే.. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తుంటారు. ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం ఏ రాశులకు విపరీతంగా యోగిస్తుందో.. ఏ రాశులకు అస్సలు యోగించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందో.. ఏ రాశులకు గ్రహణం అనేది మధ్యస్తంగా ఉంటుందో గ్రహణ గోచారంలో చెప్తారు. ఈ గోచార ప్రభావం ఆరు నెలల పాటు ప్రతి రాశిపై పని చేస్తుంది. కాబట్టి మంచి ఫలితమైనా.. చెడు ఫలితమైనా.. ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశివారికైనా ఆరు నెలల పాటు విశేషంగా పనిచేస్తుంది.
మన జన్మ రాశి నుంచి చూసుకున్నప్పుడు వచ్చే మూడు, ఆరు, పది, పదకొండు రాశుల్లో గ్రహణం ఉంటే.. ఆ గ్రహణం మనకు చాలా విశేషంగా యోగిస్తుంది. అలాంటి రాశుల వారు ఈ గ్రహణం వల్ల ఆరు నెలల పాటు విశేషంగా చక్రం తిప్పుతారని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. మొట్ట మొదటి రాశి ధనస్సు రాశి. ఎందుకంటే ధనస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనస్సు, మకరం, కుంభం.. గ్రహం ఏర్పడే కుంభ రాశి మూడో రాశి కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనస్సు రాశి వారికి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ధనస్సు రాశి వారు అంతా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే.. అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని వల్ల ఏదీ కలిసి రాక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ గ్రహణం ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ప్రాపర్టీలు కొంటారు, తోబుట్టువులతో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది.
ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి. గ్రహణం వచ్చిన కుంభ రాశి కన్యకు ఆరో రాశి. కాబట్టి కన్యా రాశి వారికి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది. కన్యా రాశి వారు ప్రస్తుతం ఉన్న సమస్య గురు బలం లేదు. గురు బలం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా, ఉద్యోగ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్లందరికీ ఈ గ్రహణం బిగ్ రిలీఫ్. పెద్ద మొత్తంలో అప్పులు తీరిపోతాయి, దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి, శతృపీడ పోతుంది.
ఇక మూడో రాశి.. వృషభం. వృషభం నుంచి లెక్కపెట్టినప్పుడు కుంభ రాశి పదో రాశి అవుతుంది. వృషభ రాశి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లైతే 100% వస్తుంది. చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో కచ్చితంగా వస్తుంది. కెరీర్లో చక్రం తిప్పుతారు. వ్యాపారంలో టాప్ పొజిషన్లో ఉంటారు. ఇలా వృషభ రాశి వారు ఈ గ్రహణం అనేది కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఉంటారు.
ఆ తర్వాత రాశి మేష రాశి. ఎందుకంటే.. మేష రాశికి 11వ స్థానంలో చంద్రగ్రహణం వస్తోంది. 11వ స్థానానికి మంచిన స్థానం మరొకటి లేదని చెప్తుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగానూ చాలా బాగుంటుంది. మేష రాశి వారికి మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుందని చెప్పచ్చు. అంటే అంతటి అద్భుతమైన శుభ ఫలితాలు ఈ గ్రహణం వల్ల ఆరు నెలల పాటు చూస్తారు.