Dhanashree Verma: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. యూట్యూబర్ ధనశ్రీ వర్మల విడాకులు ఎంత రాద్దాంతం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ నాలుగేళ్లకే విడాకులు తీసేసుకున్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు కూడా నెటిజన్లే డిసైడ్ చేసేసారు. ధనశ్రీ యూట్యూబర్, డ్యాన్సర్ కాబట్టి ఇతర హీరోలు, క్రికెటర్లతో కలిసి చనువుగా ఉంటూ డ్యాన్స్‌లు చేస్తోందని.. అది చాహల్‌కు నచ్చలేదని కొందరు.. కేవలం చాహల్ డబ్బు కోసమే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు స్టార్‌డం.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోవడంతో తెలివిగా వదిలించుకోవడానికి విడాకులు అడిగి ఉంటుందని మరి కొందరు సొంత కథలు అల్లేసుకున్నారు.
ఇటీవల వీరిద్దరికీ విడాకులు మంజూరు చేయగా.. చాహల్ ధనశ్రీకి భరణం కింద రూ.4 కోట్లు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే.. విడాకుల వాదనలు జరుగుతున్న సమయంలో చాహల్ వేసుకున్న చొక్కా తెగ వైరల్‌గా మారింది. బీ యువర్ ఓన్ షుగర్ డ్యాడీ అని రాసున్న చొక్కాతో చాహల్ కోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అంటే ధనశ్రీ తనను ఓ షుగర్ డ్యాడీలా వాడుకుంది అని చాహల్ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో ధనశ్రీ తొలిసారి తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించారు.
విడాకులు మంజూరు అయ్యే చివరి రోజున ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదని.. కోర్టు ఆవరణలోనే ఏడుస్తూ కేకలు వేసానని అన్నారు. కానీ చాహల్ మాత్రం ఏమీ పట్టనట్లు తొందరగా వెళ్లిపోయాడని అన్నారు. విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అందరూ తనపైనే నిందలు వేస్తారని తనకు ముందే తెలుసని.. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని అన్నారు. చాహల్ విషయంలో తానెంతో శ్రద్ధ చూపానని.. అన్ని సందర్భాల్లో తోడుగా ఉన్నానని అన్నారు. ఇక చాహల్ వేసుకున్న చొక్కా గురించి స్పందిస్తూ.. తనపై అంతటి నింద వేయాలనుకున్నప్పుడు ఆ ముక్క తనకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినా సరిపోయేదని.. చొక్కా వేసుకుని తన పరువు తీయాల్సిన అవసరం ఏముందని అన్నారు.