RCB Winning Celebrations: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ కప్ ఆర్సీబీని వరించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో విజయ వేడుకను నిర్వహించారు. బెంగళూరు మొత్తం ఎర్ర సముద్రంగా మారిపోయింది. అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ ఆర్సీబీ టీంకు ఘన స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరగ్గా.. ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలిచిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. బెంగళూరులోని విధాన సౌధలో సీఎం సిద్ధారామయ్య ఆర్సీబీ ఆటగాళ్లను సత్కరించారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసే క్రమంలో గేట్లు తోసుకుని వెళ్లిపోయారు. దాంతో వారి కళ్ల ముందే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనపై ఇంకా సీఎం స్పందించలేదు.