CSK: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతికి గాయం కావడంతో.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రస్తుత కెప్టెన్‌గా నియమించారు. ధోనీ రాకతో మరోసారి చెన్నై గాడిలో పడుతుంది అనుకున్నారు కానీ అంతకంతకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో అసలు రుతు లేకపోతే ధోనీనే ఎందుకు తీసుకోవాలి? ఇంకెవరూ లేరా? అనే చర్చ మొదలవుతోంది.
అసలు ధోనీని కాకుండా ఇంకెవరినైనా పెట్టి ఉంటే అభిమానులు నానా రచ్చ చేసేవారు. కానీ అభిమానుల కోసం ఐపీఎల్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తీసుకోదు కదా. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ధోనీనే తీసుకుంది. ఎందుకంటే వారికి కూడా ధోనీపై అభిమానులకు ఎంత నమ్మకం ఉందో అంతకంటే కాస్త ఎక్కువే ఉంది. అయితే.. ప్రముఖ క్రికెట్ కమెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసారు. రుతుకి గాయమైనప్పుడు పృథ్వీ షాని ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఐపీఎల్‌లో అసలు షా అమ్ముడుపోలేదు. అమ్ముడుపోకపోయినా అతనికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉందని గుర్తుచేసారు.
ధోనీ రాకతో చెన్నై అదృష్టం మారిపోతుందని అనుకున్నారు. కానీ ప్రతిసారి ధోనీనే కాపాడలేడు కదా. ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి, లేదా రెండు మ్యాచ్‌లలో గెలుస్తుందేమో కానీ పాయింట్లు సాధించలేదని అన్నారు. ఇక ఈసారి చెన్నైకి ఐపీఎల్ కప్ రావడం అనేది అసలు జరగని పని అని తెలిపారు.