RCB vs RR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీల్లో మార్పు జరగబోతోంది. రేపు జరగబోయే RCB vs RR మ్యాచ్‌లో ఛాలెంజర్స్ గ్రీన్ రంగు జెర్సీల్లో మెరవబోతున్నారు. ఏప్రిల్ 13న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది ఆరో మ్యాచ్. ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక్కసారైనా బెంగళూరు కుర్రాళ్లు గ్రీన్ జెర్సీలు ధరిస్తారు. సుస్థిరత కోసం, ప్రకృతిని కాపాడే దిశగా బెంగళూరు టీం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ గ్రీన్ జెర్సీలను వాడేసిన వస్త్రాలతో రీసైకిల్ చేసి తయారుచేసారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ప్రకృతి పట్ల, కాలుష్యం పట్ల తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. బెంగళూరు ఎప్పుడు మ్యాచ్ ఆడినా కూడా వాళ్లు ఆడే స్టేడియంలో డీజిల్‌తో తయారుచేసే జనరేటర్లను వాడనివ్వరు. అభిమానులు మైదానానికి చేరుకునేందుకు వారు ఎక్కువ వాహనాలపై రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. మైదానంలో లైటింగ్ కూడా సోలార్ పవర్ లైటింగ్ పెట్టిస్తారు. ఇక ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లను సాధించింది.