Virginity Test: పెళ్లికి ముందు రోజే కాబోయే కోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. 2019లో ఇండోర్‌కి చెందిన ఓ యువతి భోపాల్‌కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే.. వీరి వివాహం జరగడానికి ఒక రోజు ముందు అత్తింటివారు ఆమెకు ఇబ్బందికర ప్రక్రియ ద్వారా కన్యత్వ పరీక్ష చేసారట. అప్పట్లో ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత వీరి పెళ్లి జరిగింది. సంవత్సరం తర్వాత ఆ యువతి గర్భం దాల్చగా.. మూడో నెలలో అబార్షన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చగా.. నెలలు నిండకుండానే ఓ బిడ్డ పుట్టింది. ఇప్పుడు వీరికి ఓ పాప ఉంది. అయితే.. తనకు కన్యత్వ పరీక్ష చేసారంటూ ఆ యువతి ఇటీవల ఇండోర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దాంతో ఈ కేసుని స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇలా కన్యత్వ పరీక్ష చేసారంటూ కేసు పెట్టగా కోర్టు సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవడం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. అయితే.. ఎప్పుడో 2019లో ఈ ఘటన జరిగితే ఆమె ఇప్పుడు ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Virginity Test: పెళ్లికి ముందు కాబోయే కోడలికి కన్యత్వ పరీక్ష
Tags. |
More News
Hema: నటి హేమ ఇంట విషాదం
Hema: టాలీవుడ్ నటి హేమ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…
Senior Actress Tulasi: సినిమాలకు గుడ్ బై
Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సీనియర్ నటి తులసి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ…
Varanasi: రాజమౌళికి షాక్.. టైటిల్ మారుస్తారా?
Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వారణాసి సినిమాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి షాక్ తగిలింది. ఈ సినిమాను…
Blue Aadhaar: పిల్లల ఆధార్‌ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
Blue Aadhaar: పిల్లలకు సంబంధించిన బ్లూ ఆధార్ విషయంలో UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోరల్ ఇన్సైట్స్ లిమిటెడ్…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




